Mon Dec 23 2024 02:25:50 GMT+0000 (Coordinated Universal Time)
Maoists : మావోయిస్టుల ఘాతుకం.. రైలుకు నిప్పు
ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గూడ్స్ రైలుకు నిప్పు పెట్టారు. ఫలితంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు తీవ్ర దుశ్చర్యకు పాల్పడ్డారు. గూడ్స్ రైలుకు నిప్పు పెట్టారు. ఫలితంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం ఏజెస అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ ప్రాంతంలోని బచేలీ - భాన్సీ వద్ద గూడ్స్ రైలుకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.
నిలిచిపోయిన రైళ్లు.....
దీంతో కిరణ్ టోలో నుంచి విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపు వస్తున్న గూడ్స్ రైలును ఆపివేసి రైలు ఇంజన్ కు నిప్పుపెట్టారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు, బలగాలు సంఘటన స్థలికి చేరుకున్నారు. పట్టాల పై నిలిచి ఉన్న గూడ్స్ రైలును తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story