Mon Dec 23 2024 09:56:22 GMT+0000 (Coordinated Universal Time)
హన్మకొండలో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం
హన్మకొండలో ఓ ప్రాంతానికి చెందిన వివాహిత ఇంట్లో గొడవపడి మూడ్రోజుల క్రితం బయటకు వచ్చింది. రోడ్డుపై నిలబడి ఉన్న ఆమెను..
ఇంట, బయట, పబ్లిక్ ప్లేస్ లు, ప్రైవేట్ ప్లేస్ లు ఇలా అక్కడ ఇక్కడన్న తేడా లేకుండా.. ఆడపిల్లలు, మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. మనవాళ్లైనా.. పరాయివాళ్లైనా సరే ఆడది కంటికి ఒంటరిగా కనిపిస్తే చాలు. కామాంధుల్లో కోరికలు రేగి.. అవి మహిళలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని హన్మకొండలో మహిళపై ఆటోలో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హన్మకొండలో ఓ ప్రాంతానికి చెందిన వివాహిత ఇంట్లో గొడవపడి మూడ్రోజుల క్రితం బయటకు వచ్చింది. రోడ్డుపై నిలబడి ఉన్న ఆమెను ముగ్గురు వ్యక్తులు గమనించి, వెంటనే ఆటోతో వచ్చి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటోను భీమారం వైపుగా తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను వదిలేసి పరారయ్యారు. శనివారం బాధిత మహిళ తనకు జరిగిన దారుణం గురించి పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ అనే ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతని ద్వారా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Next Story