Fri Dec 20 2024 11:50:46 GMT+0000 (Coordinated Universal Time)
భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య నిన్న ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
గాయాలపాలయిన...
ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో పాటు ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామ సమీపంలో మావోయిస్టులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు దాడులు నిర్వహించాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి.
Next Story