Fri Dec 20 2024 14:17:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : భారీ ఎన్కౌంటర్ 5గురు మావోల మృతి
చిత్ర జిల్లా సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
చిత్ర జిల్లా సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత చనిపోయారన్న వదంతులు వినిపిస్తున్నా అధికారికంగా పోలీసులు మాత్రం ఖరారు చేయలేదు. చనిపోయిన వారిలో ఇద్దరిపై 25 లక్షల అవార్డు, మరో ముగ్గురిపై ఐదు లక్షల అవార్డు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
ఏకే 47 తుపాకులు...
జార్ఖండ్ రాష్ట్రం చిత్ర జిల్లాలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల తర్వాత ఆ ప్రాంతంలో రెండు ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు పెద్దయెత్తున కూంబింగ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసుల ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story