Mon Dec 23 2024 06:12:19 GMT+0000 (Coordinated Universal Time)
భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోట్ లోపల జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40 మంది తీవ్రంగా గాయపడినట్లు
పశ్చిమ బెంగాల్ లోని హల్దియాలో ఉన్న ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోట్ లోపల జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. కాగా.. ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story