Mon Dec 23 2024 13:07:28 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూల్ లో మరో మెడికో ఆత్మహత్య..
హాస్టల్ సిబ్బంది సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. లోకేష్ గది అంతా తనిఖీ చేసినా.. ఎక్కడా సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ, మెడికల్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా.. కర్నూల్ జిల్లాలో మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశ్వభారతి మెడకల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న లోకేష్.. ఆదివారం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.
హాస్టల్ సిబ్బంది సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. లోకేష్ గది అంతా తనిఖీ చేసినా.. ఎక్కడా సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. దాంతో లోకేష్ మరణంపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. లోకేష్ మృతదేహానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం.. తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా.. లోకేష్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదువు ఒత్తిడా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ గా ఇంటికొచ్చి తమ కష్టాలు తీరుస్తాడనుకున్న కొడుకు.. ఇలా అర్థాంతరంగా జీవితాన్ని ముగించేశాడంటూ ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు.. చూపరులచే కంటతడి పెట్టించాయి.
Next Story