Tue Nov 05 2024 16:17:27 GMT+0000 (Coordinated Universal Time)
అవినాష్ రెడ్డి కిడ్నాప్.. ప్రేమించిన యువతే
అవినాష్ రెడ్డి తన క్లాస్ మేట్ అయిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనకు డబ్బు అవసరం ఉందని, డబ్బు
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్లో అవినాష్ రెడ్డి అనే స్టూడెంట్‌ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. ప్రేమించిన యువతే కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిద్దిపేట జిల్లాకు చెందిన బీజేపీ నేత చక్రధర్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కిడ్నాప్ చేయడానికి గల కారణాలు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం, నగదు లావాదేవీలే అవినాష్ రెడ్డి కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చారు.
అవినాష్ రెడ్డి తన క్లాస్ మేట్ అయిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనకు డబ్బు అవసరం ఉందని, డబ్బు కావాలంటూ అవినాష్ రెడ్డిని అడిగింది ప్రియురాలు. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న ఆ యువతి, అవినాష్ రెడ్డికి దూరంగా ఉంటూ మరో ప్రేమాయణం మొదలు పెట్టింది. ఇది తెలుసుకున్న అవినాష్ రెడ్డి ప్రియురాలితో గొడవకు దిగి తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ యువతి సిద్ధిపేట్ బీజేపీ నేత చక్రధర్ గౌడ్ తో ఫోన్ చేయించి బెదిరింపులకు గురి చేసింది. అవినాష్ దగ్గర ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోతే డబ్బులు ఇవ్వవని చక్రధర్ గౌడ్ బెదించినట్లు తెలుస్తోంది. మాట్లాడాలంటూ వరంగల్ హైవేపై ఉన్న వందన హోటల్ కి రమ్మన్నాడు చక్రధర్. అతని మాటలు నమ్మి వెళ్లిన అవినాష్ రెడ్డిని తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌కు యత్నించాడు చక్రధర్. వారి నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చక్రధర్ గౌడ్‌తో పాటు అనుచరులను అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ గతంలో అనేక కేసుల్లో చిక్కుకున్నాడు. పంజాగుట్టలో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరిట పలువురు నిరుద్యోగులను మోసం చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి.
Next Story