Mon Dec 23 2024 06:08:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫామ్ హౌస్ లో బీజేపీ నాయకుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడంటూ ఆరోపణలు.. ఎక్కడ పట్టుకున్నారంటే..?
ఫామ్ హౌస్ లో బీజేపీ నాయకుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడంటూ ఆరోపణలు..
షిల్లాంగ్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తాను అమాయకుడినని, సీఎం కాన్రాడ్ సంగ్మా రాజకీయ కుట్రతో తనను ఇరికించినట్లు బెర్నార్డ్ తెలిపారు. మేఘాలయలో అధికారులు అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత హపూర్ జిల్లాలో మరక్ను పట్టుకున్నారు. రాష్ట్రంలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని తురా వద్ద ఉన్న అతని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసిన తరువాత అతడు పరారీలో ఉన్నాడు.
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ తన ఫార్మ్‌హౌజ్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. యూపీలో అరెస్టు అయిన బెర్నార్డ్‌ను తీసుకువచ్చేందుకు తమ బృందం వెళ్తున్నట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు. వ్యభిచార గృహంలో ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. మొత్తం 73 మందిని అరెస్టు చేశారు. పశ్చిమ గారోహిల్స్ జిల్లాలో ఉన్న బెర్నార్డ్ మరక్కు చెందిన రింపు బగన్ అనే ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించినట్టు ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేసిన సమయంలో 47 మంది యువకులు, 26 మంది మహిళలు.. బట్టలు లేకుండా తాగిన మైకంలో ఉన్నట్లు గుర్తించారు.
అచిక్ నేషనల్ వాలంటీర్ కౌన్సిల్ నుండి విడిపోయిన వర్గమైన, సాయుధ తిరుగుబాటు బృందం ANVC(B)కి మారక్ ఛైర్మన్. ఆయన బీజేపీలో చేరి మండలి ఎన్నికల్లో తురా నుంచి గెలుపొందారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, మారక్ తనను తాను సమర్థించుకుంటూ, తాను నిర్దోషినని చెప్పాడు. తనపై ముఖ్యమంత్రి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ ఉన్నారని.. తనకు ప్రాణభయం ఉందని అన్నారు. రాష్ట్ర బీజేపీ కూడా మారక్‌కు మద్దతు ఇచ్చింది. మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టిన్సాంగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళిపోతుందని అన్నారు. మారక్ IPCలోని వివిధ సెక్షన్లు, అనైతిక ట్రాఫికింగ్ (నివారణ) చట్టం, 1956 కింద అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అతడిపై ఇప్పటి వరకూ 25కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
Next Story