Thu Dec 19 2024 14:05:21 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో కార్ల రేసింగ్.. ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
విజయవాడలో అర్ధరాత్రి కార్ల రేసింగ్ కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది
విజయవాడలో అర్ధరాత్రి కార్ల రేసింగ్ కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శనివారం కావడంతో అర్థరాత్రి బెజవాడలో కార్ల రేసింగ్ జరిగింది. వీళ్లంతా పాతబస్తీకి చెందిన యువకులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో అతి వేగంగా వచ్చిన రెండు కార్లు అదుపు తప్పి బైకులను ఢీకొన్నాయి.
పోలీసుల హెచ్చరికలు...
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే రెండో కారు ఎక్కి నలుగురు పరారయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన కారు ఒక కంపెనీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కార్ల రేసింగ్ పై విజయవాడ పోలీసులు గత కొంత కాలంగా సీరియస్ గా వార్నింగ్ లు ఇస్తున్నా వాటిని యువకులు పట్టించుకోవడం లేదు.
Next Story