Mon Dec 23 2024 20:34:58 GMT+0000 (Coordinated Universal Time)
నెత్తురోడిన రోడ్డు.. నలుగురు దుర్మరణం, 6 ఆవులు మృతి
రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొనడంతో.. ఇంజిన్ క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద స్థలంలో దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.
రహదారి రక్తదాహానికి నలుగురు వ్యక్తులు, ఆరు ఆవులు బలయ్యాయి. ఈ ఘోర ప్రమాదం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి మిర్చి లోడుతో గుంటూరు వెళ్తోన్న డీసీఎంను మినీ ట్రాలీ ఢీ కొట్టింది. మోక్ష గుండం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మినీ ట్రాలీలో ఉన్న 6 ఆవులు కూడా మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.
రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొనడంతో.. ఇంజిన్ క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద స్థలంలో దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. వ్యక్తులతో పాటు, నోరులేని జీవాలు ప్రమాదంలో మరణించడం చూపరులను కలచివేసింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story