Mon Dec 23 2024 06:24:22 GMT+0000 (Coordinated Universal Time)
మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం
మూడున్నరేళ్ల కుమార్తెతో కలిసి కామాక్షిపాళ్యంలోని కావేరీ నగర్ లో నివాసముంటోంది. ఆమె ఓ దుకాణంలో పనిచేస్తున్న సమయంలో..
కామాంధులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల నుండి పండు ముసలి బామ్మల వరకూ.. తమ క్షణకాలం కోరిక తీర్చుకునేందుకు ఎవ్వర్నీ వదలడం లేదు. తాజాగా ఓ చిన్నారిపై 26 ఏళ్ల వ్యక్తి హత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రిలా చిన్నారిని చూసుకోవాల్సిన అతను.. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బాగల్ కోట్ కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్త నుండి విడిపోయి.. మూడున్నరేళ్ల కుమార్తెతో కలిసి కామాక్షిపాళ్యంలోని కావేరీ నగర్ లో నివాసముంటోంది. ఆమె ఓ దుకాణంలో పనిచేస్తున్న సమయంలో.. 26 ఏళ్ల వ్యక్తితో పరిచయమైంది. అప్పట్నుండీ వారిద్దరూ కలిసి ఉంటున్నారు. మహిళ పనికివెళ్లినపుడు చిన్నారిని ఆ వ్యక్తే చూసుకునేవాడు. ఈ క్రమంలో.. రెండ్రేజుల క్రితం మద్యం మత్తులో ఉన్న అతడు.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి చంపేశాడు.
ఇంతలో పని ముగించుకుని ఇంటికొచ్చిన తల్లి.. అచేతనంగా ఉన్న కుమార్తెను చూసి షాకైంది. ఆ వ్యక్తిని ఏం చేశావని ప్రశ్నించగా.. ఆమెపై ఎదురుదాడి చేశాడు. దాంతో సదరు మహిళ స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Next Story