Mon Dec 23 2024 17:47:56 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. బాలుడిపై లైంగిక దాడి, ఆపై గొంతుకోసి
ఆ దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా.. రెండో కొడుకు దివ్యాంగుడు(మూగవాడు). దాంతో ఆ బాలుడిని పాఠశాలకు పంపలేదు. కరోనా కారణంగా ..
పూణె : మహారాష్ట్రలోని పూణెలో జరిగిన దారుణ ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలుడి గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పడేశారు. బాధిత బాలుడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ బాలుడు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలానికి చెందిన దంపతులు పొట్టకూటి కోసం పూణెకు వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు.
ఆ దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా.. రెండో కొడుకు దివ్యాంగుడు(మూగవాడు). దాంతో ఆ బాలుడిని పాఠశాలకు పంపలేదు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం గ్రామానికి తిరిగొచ్చిన వారు.. రెండు నెలల క్రితం మళ్లీ ఆ బాలుడిని వెంటతీసుకుని పూణెకు వెళ్లారు. బాలుడిని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్తున్నారు. మార్చి 24, గురువారం కూడా తల్లిదండ్రులు కూలికి వెళ్లగా బాలుడు ఇంటివద్దే ఉంటున్నాడు. కొత్రూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు ఉంటున్న ఇంటిపక్కనే ఉన్న వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి ఆ సాయంత్రం బయటికి తీసుకెళ్లాడు. బాలుడిని బైక్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. మరికొందరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.
అనంతరం బాలుడిపై దాడి చేసి.. హత్య చేశారు. బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి చెత్తకుండిలో వేస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పూణె నుంచి శనివారం ఉదయం గండేడ్ మండలంలోని స్వగ్రామానికి బాలుడి మృతదేహాన్ని తీసుకొచ్చి, తమపొలంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కేసులో బాలుడి ఇంటి పక్కన నివాసం ఉండే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్రూడ్ పీఎస్ ఇన్ స్పెక్టర్ మహేంద్ర జగ్తాప్ వెల్లడించారు.
Next Story