Fri Dec 20 2024 08:10:26 GMT+0000 (Coordinated Universal Time)
నీచాతి నీచం.. చిన్నారి మృతదేహంపై అత్యాచారం
తంగర్ ప్రాంతానికి చెందిన ఏడాదిన్నర వయసుగల బాలిక అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. వైద్యులు గుండెలో రంధ్రం..
విద్య మొదలు.. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు ముందుంటున్నారని గర్విస్తున్నా.. దేశంలో చాలా మంది చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి చనిపోయిన చిన్నారిని కూడా వదల్లేదు ఓ కామాంధుడు. ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గుజరాత్ లోని సురేంద్రనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలుకా వివరాలు ఇలా ఉన్నాయి.
తంగర్ ప్రాంతానికి చెందిన ఏడాదిన్నర వయసుగల బాలిక అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. వైద్యులు గుండెలో రంధ్రం ఏర్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 25న మరణించింది. అదే రోజున చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ మరుసటిరోజు కర్మక్రతువులు నిర్వహించేందుకు బంధువులు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన చూసిన వారంతా చలించిపోయారు.
పాతిపెట్టిన బాలిక మృతదేహం మట్టిపై పడి ఉంది. పైగా బాలిక శరీరంపై నూలుపోగు కూడా లేదు. దాంతో బంధువులు బాలిక మృతదేహంపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story