Mon Dec 23 2024 17:38:42 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దపల్లిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్రతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ మైనర్ బాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ దారుణ ఘటన తర్వాత ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అప్పన్నపేట శివారులో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పరిస్థితిని గమనించిన నిందితులు ఓ ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే బాధిత బాలిక చనిపోయింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రియల్ఎస్టేట్ వెంచర్ లో పనిచేస్తున్న పెద్దపల్లి చెందిన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఈ అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Next Story