Fri Dec 20 2024 21:53:04 GMT+0000 (Coordinated Universal Time)
సంగారెడ్డిలో దారుణం.. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో బాలిక ప్రసవం.. ఎవరి తప్పిదం ?
వెంటనే స్కూల్ కు చేరుకుని తమ కూతురు గర్భవతి అయి ప్రసవించడంపై ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. ఇందుకు కారణం ఎవరు ? అభం, శుభం
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న బాలిక.. మార్చి నెల ఆఖరివారంలో స్కూల్ బాత్రూమ్ లో ప్రసవించింది. దాంతో ప్రిన్సిపాల్ బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మీ కూతురు ప్రసవించింది. వచ్చి ఇంటికి తీసుకెళ్లండని చెప్పడంతో.. ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు.
వెంటనే స్కూల్ కు చేరుకుని తమ కూతురు గర్భవతి అయి ప్రసవించడంపై ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. ఇందుకు కారణం ఎవరు ? అభం, శుభం తెలియని పసికందులపైనా మీ కామ కోరికలు తీర్చుకునేది అంటూ వాపోయారు. అయినా ఆ ప్రిన్సిపాల్ లో కించిత్ అయినా కనికరం కలగలేదు. మీ బిడ్డను తీసుకెళ్లండి.. బయట ఎవరికీ ఈ విషయాన్ని చెప్పకండి అని బెదిరించాడు. దాంతో చేసేది లేక కన్నకూతురి జీవితం ఇలా నాశనం అయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఊళ్లోకి వెళ్తే.. నలుగురు నానా రకాలుగా మాట్లాడతారని భావించారో ఏమోగానీ.. కూతురు ప్రసవించిన బిడ్డని ముళ్లపొదల్లో పారేసి ఇంటికెళ్లారు.
ఆ పసికందు ఏడుపు విన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో శిశువును ఆస్పత్రికి తరలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో బాలిక ప్రసవంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీమ్ బేగం, స్టాఫ్ నర్స్ సంధ్య లను సెక్రటరీ సస్పెండ్ చేశారు.
Next Story