Mon Dec 23 2024 12:51:29 GMT+0000 (Coordinated Universal Time)
5 సంవత్సరాల బాలికపై అత్యాచారం.. గొంతు కోసి హత్య
మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికను అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు
మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికను అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్పూర్ ప్రాంతంలో ఇంటి పైకప్పుపై గుడ్డలో చుట్టి ఉన్న బాలిక మృతదేహం శనివారం కనిపించిందని సోహగ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ రజక్ తెలిపారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రాథమిక శవపరీక్ష నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని ఆయన తెలిపారు.
ఇంటి పై కప్పు పై మృతదేహం
బాధితురాలి కుటుంబ పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అధికారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు వెతికినా తమ గ్రామంలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు వారి ఇంటి పైకప్పును పరిశీలించగా మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారి తెలిపారు.
Next Story