Mon Dec 23 2024 18:29:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాగులో విద్యార్థిని మృతదేహం.. శరీరంపై కత్తిపోట్లు.. అసలేం జరిగింది ?
వసయీ ప్రాంతంలోని ముంబై- అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో స్థానికులు..
స్కూల్ కి వెళ్లి 15 ఏళ్ల విద్యార్థిని ఓ బ్యాగులో శవమై కనిపించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసయీ ప్రాంతంలోని ముంబై- అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో స్థానికులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఓ అనుమానాస్పద బ్యాగును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి బ్యాగును తెరచి చూశారు. అందులో కనిపించిన దృశ్యంచూసి పోలీసులు ఖంగుతిన్నారు.
ఆ బ్యాగులో 15 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహంపై కత్తితో పొడిచిన గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వివరించారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. బాలిక ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివసించేదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. బాలిక తల్లిదండ్రులు ఆమె అదృశ్యమైన రోజునే అంధేరీ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. బాలికపై అత్యాచారయత్నం జరిగిందా ? అన్న విషయం పోస్టుమార్టమ్ లో తెలియాల్సి ఉంది. సెక్షన్ 302 (హత్య) కింద కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
Next Story