Mon Mar 31 2025 12:54:21 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
పెద్దలు తమ ప్రేమను అంగీకరించి పెళ్లి చేయరన్న మనస్తాపంతో ఇద్దరూ ఇంట్లో ఒకే తాడుకు ఉరివేసుకుని..

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరి కులాలు వేరు, పైగా మైనర్లు కావడంతో.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించి పెళ్లి చేయరన్న మనస్తాపంతో ఇద్దరూ ఇంట్లో ఒకే తాడుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్ సెకండియర్ చదువుతున్నాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో ఏం జరిగిందో గానీ.. బుధవారం (జులై12) భగీరథ్ కు చెందిన ఓ ఇంట్లో ఇద్దరూ ఉరివేసుకుని బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుర్తించిన భగీరథ్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా..కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Next Story