Mon Dec 23 2024 12:19:26 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ బాలికపై అత్యాచారం.. అర్థరాత్రి ఫ్లై ఓవర్ పై వదిలివెళ్లిన వైనం
రాజస్థాన్‌లోని అల్వార్‌లోని తిజారా ఫ్లైఓవర్ దగ్గర దివ్యాంగురాలైన మైనర్ బాలికను ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. ఆ బాలికపై
రాజస్థాన్‌లోని అల్వార్‌లోని తిజారా ఫ్లైఓవర్ దగ్గర దివ్యాంగురాలైన మైనర్ బాలికను ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. ఆ బాలికపై అత్యాచారం చేశారని తెలుస్తోంది. ఆమె అంతర్భాగాల నుంచి రక్తస్రావం కావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ తేజస్విని గౌతమ్ తెలిపారు. ఫ్లైఓవర్ వద్ద మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి తీవ్ర రక్తస్రావం అవుతోన్న మైనర్ బాలికను అక్కడ వదిలి పెట్టి వెళ్లారు. ప్రస్తుతం బాలికను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కాగా.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు ఫ్లైఓవర్‌పైకి వెళ్లి బాలికను అక్కడ దింపారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు. బాలిక విపరీతమైన నొప్పితో బాధపడుతోందని, అక్కడ నిలబడిన కొందరు వ్యక్తులు బాలికను వీడియో తీసిన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గుంపులో నుండి కొంతమంది పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక వయస్సు 15-16 సంవత్సరాలు ఉంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు భావిస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనకు గురై మాట్లాడే స్థితిలో లేదని, ఆమె పూర్తి స్పృహలోకి వచ్చాక వాంగ్మూలాన్ని తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story