Mon Nov 18 2024 15:32:46 GMT+0000 (Coordinated Universal Time)
8 గంటల్లోనే మియాపూర్ హత్య వెనుక ఉన్నదెవరో తేల్చేశారు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవేందర్ గాయన్ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవేందర్ గాయన్ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారైన సంగతి తెలిసిందే. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు విడిచాడు. దేవేందర్ కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్గా గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య కేసును పోలీసులు చేధించారు.
సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. దేవేందర్ పై రతీష్ నాయర్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. రతీష్ నాయర్ ని అరెస్ట్ చేశామని మాదాపూర్ DCP సందీప్ వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే దేవేందర్ పై రతీష్ నాయర్ కాల్చి చంపినట్టుగా విచారణలో తేలింది. కలకత్తా కి చెందిన దేవేందర్ 9 ఏళ్లుగా సందర్శిని హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.. అదే హోటల్ లో కేరళ కి చెందిన రతీష్ నాయర్ మేనేజర్ గా చేరాడు. ఆ హోటల్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ అయ్యింది. ఈ పోస్ట్ కోసం ఇద్దరి మధ్య పోటీ వచ్చింది. దేవేందర్ పని తీరు మంచిగా ఉండటంతో హోటల్ యాజమాన్యం అతడికే జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో దేవేందర్ పై రితీష్ కోపం పెంచుకున్నాడు. రితీష్ ప్రవర్తన బాగోలేక పోవడంతో ఉద్యోగం లో నుంచి తొలగించారు. దీంతో దేవేందర్ పై మరింత కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని అనుకున్నాడు.ఈ క్రమంలోనే రితీష్ బీహార్ వెళ్ళి.. ఒక కంట్రీ మేడ్ పిస్టల్ కొన్నాడు. దేవేందర్ హోటల్ నుంచి బయటకు వచ్చే టైం లో కాపుకాసి పక్కా ప్లాన్ ప్రకారం 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత మెట్రో ట్రైన్ లో పారిపోయే ప్రయత్నం చేశాడు. కేవలం 8 గంటల్లోనే కేసును చేదించామని మాదాపూర్ DCP సందీప్ వెల్లడించారు.
Next Story