Mon Dec 23 2024 06:42:39 GMT+0000 (Coordinated Universal Time)
మొబైల్ ఛార్జర్ వైర్ ను నమిలిన 8 నెలల పాప
స్విచ్‌బోర్డ్ సాకెట్‌కు కనెక్ట్ చేసిన మొబైల్ ఛార్జర్ కు ఉన్న వైర్ పిన్ను నమిలిన
స్విచ్‌బోర్డ్ సాకెట్‌కు కనెక్ట్ చేసిన మొబైల్ ఛార్జర్ కు ఉన్న వైర్ పిన్ను నమిలిన ఎనిమిది నెలల పాప విద్యుదాఘాతంతో మరణించింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ తాలూకాలోని సిద్దరాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సంతోష్ కల్గుట్కర్, సంజన కల్గుట్కర్ దంపతుల కుమార్తె సానిధ్య.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్ ఛార్జర్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేసి, స్విచ్ ఆఫ్ చేయలేదు. ఛార్జ్ వైర్ కు దగ్గరగా ఉన్న పాప మొబైల్ ఛార్జర్ వైర్ పిన్ను నమలడం ప్రారంభించి విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తండ్రి సంతోష్ కల్గుటక్ హుబ్బళ్లి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (హెస్కామ్)లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న అతను కార్యాలయంలోనే కుప్పకూలిపోయాడు. నెలల చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
Next Story