Mon Dec 23 2024 14:00:47 GMT+0000 (Coordinated Universal Time)
స్కూల్ విద్యార్థులపై వానరసైన్యం దాడి.. చిన్నారికి గాయాలు
ఇంతలో ఓ వ్యక్తి అటుగా రావడంతో.. ఆయన ఆ కోతులను చెదరగొట్టారు. దాంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది.
వనం వీడి జనంలోకి వచ్చిన కోతులు.. ఆహారం కోసం జనావాసాలపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే పిల్లలను కూడా హడలెత్తిస్తున్నాయి. నిన్నటివరకూ హైదరాబాద్ లో కుక్కల బెడదతో హడలెత్తిపోయారు ప్రజలు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోతులు స్వైరవిహారం చేస్తూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి.
ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ తమదే అడ్డా అన్నట్టుగా కోతులు రెచ్చిపోతున్నాయి. తాజాగా స్కూల్ కు వెళ్తున్న కొందరు విద్యార్థులపై కోతుల గుంపు దాడి చేసింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులను తరిమాయి. ఇంతలో ఓ వ్యక్తి అటుగా రావడంతో.. ఆయన ఆ కోతులను చెదరగొట్టారు. దాంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. కోతుల దాడిలో వైష్ణవి అనే చిన్నారికి గాయాలు కావడంతో.. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి. కోతులు చేస్తున్న రచ్చకి అందరూ బెంబేలెత్తిపోతున్నారు. స్థానిక అధికారులకు కోతుల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
Next Story