Mon Dec 23 2024 06:16:30 GMT+0000 (Coordinated Universal Time)
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హరిప్రీత్ సింగ్ ను ఎన్ఐఏ పోలసులు అరెస్ట్ చేశారు
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హరిప్రీత్ సింగ్ ను ఎన్ఐఏ పోలసులు అరెస్ట్ చేశారు. లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో హరిప్రీత్ సింగ్ నిందితుడు. అంతర్జాతీయ సిఖ్ ఫెడరేషన్ చీఫ్ గా హరిప్రీత్ సింగ్ వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారని చెబుతున్నారు.
పది లక్షల రివార్డు...
హరిప్రీత్ సింగ్ పై పది లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఆయన కోసం అనేక రకాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. మలేషియా నుంచి వచ్చిన వెంటనే ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే అరెస్ట్ చేసినట్లు తెలిసింది. హరిప్రీత్ సింగ్ అరెస్ట్ తో నేరాలు తగ్గుముఖంపడతాయని పోలీసులు భావిస్తున్నారు.
Next Story