Mon Dec 23 2024 06:34:14 GMT+0000 (Coordinated Universal Time)
భర్త ఆ పని చేయలేదని.. తల్లీకూతురు బలవన్మరణం
విషయం భర్తకు చెప్పింది. కానీ.. అత్తింటివారు అందుకు ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన దివ్య.. 6వ
చిన్న చిన్న విషయాలకే.. మనస్తాపంతో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న రోజులివీ. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, వరకట్న వేధింపులు.. ఇలా అనేక రకాల కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో తల్లీ,కూతురు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న కుక్కపిల్లను వేరేవారికి ఇచ్చేందుకు అత్తింటివారు అంగీకరించకపోవడమే అందుకు కారణమని తెలిసిన పోలీసులు అవాక్కయ్యారు.
దివ్య (36) అనే మహిళకు కుక్కలంటే ఎలర్జీ. కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె వైద్యులను సంప్రదించింది. కుక్కలంటే ఎలర్జీ ఉన్న కారణంగానే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తేల్చారు. కుక్కలకు దూరంగా ఉండాలని సూచించడంతో.. విషయం భర్తకు చెప్పింది. ఇంట్లో ఉన్న కుక్కను వేరేవారికి ఇవ్వాలని కోరింది. కానీ.. అత్తింటివారు అందుకు ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన దివ్య.. 6వ తరగతి చదువుతున్న తన కూతురు హృద్య(13)తో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా దివ్య భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story