Sun Apr 06 2025 12:00:00 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూల్ లో ఘోరం.. పెళ్లైన రెండువారాలకే భార్య, అత్తల హత్య
హైదరాబాద్ లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తున్న శ్రావణ్ కు కర్నూల్ కు చెందిన రుక్మిణితో రెండువారాల క్రితం వివాహం..

కర్నూల్ లో దారుణ ఘటన జరిగింది. జంట హత్యలతో కర్నూల్ నగరం ఉలిక్కిపడింది. పెళ్లైన రెండు వారాలకే కొత్త అల్లుడు భార్య, అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య, అత్త మరణించగా.. మామకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తున్న శ్రావణ్ కు కర్నూల్ కు చెందిన రుక్మిణితో రెండువారాల క్రితం వివాహం జరిగింది. పెళ్లన్నాక గొడవలు, మనస్ఫర్థలు రాకుండా లేకుండా ఉండవు కదా.
ఇక్కడ కూడా రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్ఫర్థలు వచ్చాయి. దాంతో ఆవేశానికి గురైన శ్రావణ్ కర్నూల్ పట్టణం సుబ్బలక్ష్మీనగర్ లో నివాసం ఉంటోన్న అత్తింటివారిపై మంగళవారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య రుక్మిణీ, అత్త రమాదేవి మరణించారు. అడ్డొచ్చిన మామపై కూడా కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story