Mon Dec 23 2024 11:41:06 GMT+0000 (Coordinated Universal Time)
లాడ్జిలో తల్లి -కొడుకు ఆత్మహత్య.. కారణం ఆ ఏడుగురేనా ?
ఆత్మహత్యకు ముందు తల్లి కొడుకు రాసిన సూసైడ్ నోట్.. సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు ఏడుగురు
కామారెడ్డిలో విషాద ఘటన జరిగింది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీ -కొడుకు నిప్పంచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున గదిలోనుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. మృతులు తల్లి పద్మ, కుమారుడు సంతోష్‌లను రామాయంపేట్ వాసులుగా గుర్తించారు. పద్మ వైద్యం నిమిత్తం ఏప్రిల్ 11న లాడ్జికి వచ్చినట్లు సమాచారం. డీఎస్పీ సోమనాథం, సీఐ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు తల్లి కొడుకు రాసిన సూసైడ్ నోట్.. సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు ఏడుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. సెల్ఫీ వీడియోలో తమ బాధను వెలిబుచ్చారు. ఆత్మహత్య చేసుకోడానికి కారణమైన వారి గురించి, వారు తమ కుటుంబానికి చేసిన మోసాలు, పెట్టిన ఇబ్బందుల గురించి చెప్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.
"బాసం శ్రీనుతో కలిసి నేను వ్యాపారం చేశా. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరారు. ఇవ్వలేమని.. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నారు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. దీనిపై మరుసటి రోజే మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. 10 రోజులయ్యాక ఫేస్బుక్ అంశంలో సంబంధం లేదన్నారు. నా ఫోన్లో సమాచారాన్ని పోలీసులు జితేందర్‌గౌడ్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి జితేందర్‌గౌడ్ మనుషులు ఫోన్లోని సమాచారంతో ఇబ్బంది పెట్టారు. నన్ను బెదిరించే విషయాన్ని కూడా పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఏడాది పాటు జితేందర్ గౌడ్ మనుషులు నన్ను ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అర్థికంగా నష్టపోయాను. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయాను. వాళ్ల ఇబ్బందులు తట్టుకోలేకనే నేను, అమ్మ చనిపోతున్నాం." అని సంతోష్ తెలిపాడు.
Next Story