Mon Dec 23 2024 06:52:49 GMT+0000 (Coordinated Universal Time)
కూతురిని కడతేర్చిన తల్లి..పరువు హత్య ?
నర్సింగ్ కోర్సు చేస్తున్న అరుణకు.. ఓ అబ్బాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది.
యూపీకి చెందిన ఆయుషి హత్య ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సూట్ కేస్ లో దొరికిన యువతి మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మూడ్రోజుల్లో చేధించారు. తాజాగా తమిళనాడులో మరో యువతి హత్య వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరుముగ కని, పిచయ్ దంపతులకు అరుణ(19) అనే కూతురు ఉంది. వీరంతా తిరునల్వేలికి సమీపంలోని ఊరిలో ఉంటారు. అరుణ చదువు నిమిత్తం వేరే ఊరికి వెళ్లింది.
నర్సింగ్ కోర్సు చేస్తున్న అరుణకు.. ఓ అబ్బాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని నమ్మకంగా పిలిపించింది. తీరా ఇంటికొచ్చాక తాను చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని కూతురికి నచ్చజెప్పింది. దాంతో అరుణ తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లాడుతానంది. తల్లి-కూతురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అరుముగ కత్తితో కూతురి గొంతుకోసి హతమార్చింది. అనంతరం తలకు వేసుకునే రంగు లిక్విడ్ తాగి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు అరుముగాన్ని ఆస్పత్రిలో చేర్చారు.
స్థానికుల సమాచారం అందుకు పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. అరుణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. అరుముగం చికిత్స పొందుతోంది. ఆమె కోలుకున్నాక విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story