Mon Dec 23 2024 03:52:13 GMT+0000 (Coordinated Universal Time)
ACB : ఏసీబీ సోదాల్లో కోట్ల ఆస్తులు ... ఉద్యోగి ఇంట్లో బంగారం, వెండి
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు ఏసీబీ దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు ఏసీబీ దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. ఎంవీఐగా పనిచేస్తున్న రమేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడ జిల్లా బెండపూడి చెక్‌పోస్టులో ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఏసీబీ సోదాల్లో వెల్లడయింది. ఆయనకు 4.05 కోట్ల స్థిరాస్థులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఎంవీఐగా పనిచేస్తున్న...
రాజమండ్రిలోని గాంధీపురంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న రమేష్ బాబుకు గుడివాడలో సొంత ఇల్లు ఉంది. కంకిపాడు, జగ్గయ్యపేట, రాజమండ్రిలలో ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, మెదక్, కంచికచర్ల, విజయవాడ, గుడివాడ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులతో పాటు 1.32 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు నిల్వలతో పాటు బంగారు, వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Next Story