Mon Dec 23 2024 12:47:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్రెండ్ ను చంపి.. నేరం పాముపై వేయాలని ప్రయత్నించాడు
అయితే కేసు దర్యాప్తు సందర్భంగా పోస్ట్మార్టం నివేదికలో పాము కాటు కారణంగా మరణానికి కారణమని పేర్కొనలేదని భదౌరియా చెప్పారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో తన స్నేహితుడిని హతమార్చి, పాము కాటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశాడో వ్యక్తి. మృతదేహం పక్కన చనిపోయిన నాగుపామును ఉంచి.. పాము కరవడం వల్లనే చనిపోయాడని చెప్పుకొచ్చాడు.. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్ నవల్ సింగ్ మృతదేహం అతడి స్నేహితుడు సందీప్ బాగ్మారే ఇంట్లో లభ్యమైందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రాజేష్ సింగ్ భదౌరియా మీడియాకి తెలిపారు. "శవం దగ్గర చనిపోయిన నాగుపాము కూడా పడి ఉంది. నవల్ సింగ్, అతని స్నేహితులు రాత్రిపూట కలిసి మద్యం సేవించారని బాగ్మారే మాకు తెలిపాడు "అని భదౌరియా చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాగ్మారే సింగ్ను రాత్రి ఆలస్యం కావడంతో తన ఇంట్లో పడుకోమని కోరాడు. మరుసటి రోజు ఉదయం బాగ్మారే తన స్నేహితుడు చనిపోయాడని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బాగ్మారే ఇంటికి చేరుకున్నప్పుడు, వారు మృతదేహం దగ్గర చనిపోయిన నాగుపాము పడి ఉండటాన్ని కనుగొన్నారు, దీని కారణంగా బాగ్మారే రాత్రి నిద్రిస్తున్నప్పుడు పాము కాటు కారణంగా మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావించారు.
అయితే కేసు దర్యాప్తు సందర్భంగా పోస్ట్మార్టం నివేదికలో పాము కాటు కారణంగా మరణానికి కారణమని పేర్కొనలేదని భదౌరియా చెప్పారు. మరణించిన వ్యక్తి శరీరంలో విషం లేదా శరీరంపై పాము కాటుకు సంబంధించిన సంకేతాలు లేవని గుర్తించారు. ఊపిరాడక చనిపోయాడని నివేదిక వెల్లడించిందని భదౌరియా తెలిపారు. దీని తర్వాత బాగ్మారేను పోలీసులు ప్రశ్నించారు. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా, ఆ తర్వాత హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బాగ్మారే సింగ్ నోటికి, ముక్కుకు గుడ్డ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు అంగీకరించాడు.
Next Story