Wed Dec 18 2024 21:50:32 GMT+0000 (Coordinated Universal Time)
జైలులోనే ముంబై బాంబుపేలుళ్ల కేసు నిందితుడు హత్య
ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యాడు.
జైలులో ముంబై బాంబు పేలుళ్ల నిందితుడుహత్యకు గురయ్యాడు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యాడు. జైలులో ఉన్న బాత్ రూమ్ లో లో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో మున్నాకు మధ్య ఘర్షణ తలెత్తిందని చెబుతున్నారు. మొదట వాగ్వాదంతో ప్రారంభయిన ఇది చివరకు హత్య కు దారితీసిందని జైలు అధికారులు చెబుతున్నారు.
రాడ్ తో కొట్టడంతో...
కొందరు ఖైదీలు మున్నాను రాడ్ తో తలపై కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 1993 మార్చి12వ తేదీన ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మరణించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న మున్నా కొల్హాపూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. మున్నా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Next Story