Mon Dec 23 2024 05:48:12 GMT+0000 (Coordinated Universal Time)
మరో వ్యభిచారం గుట్టురట్టు.. హీరోయిన్ సహా ముగ్గురు నటీమణులు అరెస్ట్
రాయల్ పామ్ హోటల్లో జరుగుతున్న సెక్స్ రాకెట్ను క్రైమ్ బ్రాంచ్ సోషల్ సర్వీస్ వింగ్ బట్టబయలు చేసింది. భోజ్ పురి హీరోయిన్
జీవితంలో ఎదగాలి.. హుందాగా, లగ్జరీగా బ్రతకాలని అందరికీ ఉంటుంది. ఆ కోరికలను తీర్చుకునేందుకు కష్టపడాలి. అదిమానేసి.. చాలామంది అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు అలవాటుపడుతున్నారు. వాటిలో ఒకటి సెక్స్ రాకెట్. ఈ దందాలో కాసుల వర్షం కురుస్తుంది. అందంగా ఉన్న అమ్మాయిలకు ఎరవేసి.. వ్యభిచార కూపంలోకి దింపేస్తున్నారు. వారిపై ధనాన్ని ఆర్జించి మేడలు కట్టుకుని దర్జాగా బ్రతుకుతున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా ఉంది. తాజాగా.. ముంబైలో ఓ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది.
రాయల్ పామ్ హోటల్లో జరుగుతున్న సెక్స్ రాకెట్ను క్రైమ్ బ్రాంచ్ సోషల్ సర్వీస్ వింగ్ బట్టబయలు చేసింది. భోజ్ పురి హీరోయిన్ సహా.. ముగ్గురు నటీమణులను అరెస్ట్ చేశారు. రాయల్ పామ్ హోటల్లో లో భారీగా వ్యభిచారం జరుగుతున్నట్లు రహస్య సమాచారం రావడంతో.. ఆ హోటల్ పై శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మోడల్స్ ను పోలీసులు రక్షించారు. ఈ దందాకోసం యువతులను ట్రాప్ చేస్తున్న 24 ఏళ్ల భోజ్పురి నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మహిళ భోజ్పురి చిత్ర పరిశ్రమతో సంబంధం కలిగి ఉంది. భోజ్పురి చిత్రం ‘లైలా మజ్ను’ అలాగే వెబ్ సిరీస్ ‘జామ్స్టిక్ బాక్స్’ , భోజ్పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది.
Next Story