Mon Dec 23 2024 08:21:40 GMT+0000 (Coordinated Universal Time)
తల్లిని చంపి.. తండ్రికి వీడియో కాల్ చేసిన కొడుకు
తన తల్లిని చంపి, మృతదేహాన్ని ఒక గదిలోకి వేసి, తన చెల్లెల్ని మరో గదిలో
PUBG ఆడకుండా అడ్డుకున్నందుకు ఓ మైనర్ బాలుడు తన తల్లిని కాల్చి చంపిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది. తాజాగా పోలీసులకు లభించిన కొత్త లీడ్ ప్రకారం, నిందితుడు హత్య జరిగిన మూడు రోజుల తర్వాత జూన్ 7 న తన తండ్రికి సంఘటన గురించి తెలియజేయడానికి ఫోన్ చేసాడు. తన తల్లిని తానే హత్య చేశానని ఆ బాలుడు తన తండ్రికి వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత డోర్ దగ్గర నిలబడి పోలీసులు వచ్చే వరకు వేచి చూశాడు. పోలీసులు వచ్చిన వెంటనే 16 ఏళ్ల బాలుడు వారిని లోపలికి తీసుకెళ్లి హత్యకు ఉపయోగించిన పిస్టల్‌ను చూపించి, ఆపై మృతదేహాన్ని కూడా చూపించాడు.
ప్రస్తుతం అసన్సోల్లో పోస్ట్ చేయబడిన నిందితుడి తండ్రి, జూన్ 3 నుండి తన కొడుకు, భార్యను సంప్రదించడం లేదని వెల్లడించాడు. తన ఇంటిలో అందరూ బాగున్నారా అని తెలుసుకోడానికి తన కొడుకు ట్యూషన్ టీచర్‌తో సహా చాలా మందిని ఇంటి దగ్గరకు పంపాడు. అయితే ఆ తలుపు ఎవరూ తెరవలేదు. జూన్ 7వ తేదీన కొడుకు నుంచి ఫోన్ రావడంతో కొడుకు హత్య చేసిన ఆయుధాన్ని చూపించాడు. నిందితుడికి తండ్రి ఏం చెప్పాడో.. తలుపు దగ్గర ఎందుకు వేచి ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ బాలుడు లక్నోలో తన తల్లిని చంపి, మృతదేహాన్ని ఒక గదిలోకి వేసి, తన చెల్లెల్ని మరో గదిలో బంధించాడు. అతను తన నేరాన్ని అంగీకరించాడు. తనను PUBG ఆడనివ్వనందుకు తన తల్లిపై కోపం తెచ్చుకుని ఆదివారం అర్ధరాత్రి తన తండ్రి లైసెన్స్ తుపాకీతో కాల్చి చంపినట్లు చెప్పాడు.
ప్రాణాలు తీస్తున్న పబ్జీ గేమ్:
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. ఆ గేమ్ ఓడిపోవడంతో ఇంట్లో పిల్లలు హేళన చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని ప్రభు వెళ్లాడు. ఆదివారం ఎంతకీ బయటకి రాకపోవడంతో నిద్ర లేపెందుకు తండ్రి తలుపులు తీశాడు. ప్రభు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. మైనర్ బాలుడి మరణంతో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ లో విషాదం నెలకొంది.
Next Story