Fri Dec 20 2024 19:23:25 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం జిల్లాలో పరువు హత్య
అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది. ఈ హత్య జిల్లాలో కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేదర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది. ఈ హత్య జిల్లాలో కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లాల వజ్రకరూరు మండలం వెంకటాపల్లికి చెందిన నరేంద్ర అదే గ్రామానికి చెందిన వేరే సామాజికవర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకుందామని తలిస్తే, పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు.
రెండేళ్ల క్రితం వివాహం...
దీంతో వీరు రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని కోనేపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. అయితే నరేంద్ర పై కక్ష కట్టిన యువతి కుటుంబ సభ్యులు వెంకటాపల్లికి వెళ్లిన నరేంద్ర పై దాడి చేశారు. వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్య కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story