Mon Dec 23 2024 15:53:04 GMT+0000 (Coordinated Universal Time)
మయన్మార్ యువతిపై ఢిల్లీలో సామూహిక అత్యాచారం
మహిళను కిడ్నాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ఆమె నోటిలో గుడ్డలు కుక్కి.. కూతురితో సహా ఎత్తుకెళ్లాడు.
మయన్మార్ నుంచి భారత్ వచ్చిన శరణార్థి యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో 21 ఏళ్ల మయన్మార్ యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు తనభర్త, రెండున్నరేళ్ల కూతురితో కలిసి వికాస్ పురి ప్రాంతంలో నివసిస్తున్నారు. కూతురికి కడుపులో నొప్పి, ఫ్లూ తో బాధపడుతుండటంతో వైద్యుడిని సంప్రదించేందుకై కాళింది కుంజ్ కు వచ్చింది.
పబ్లిక్ రెస్ట్రూమ్ బయట భర్త కోసం ఎదురు చూస్తుండగా ఓ ఆటో వచ్చి వారిపక్కనే ఆగింది. మహిళను కిడ్నాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ఆమె నోటిలో గుడ్డలు కుక్కి.. కూతురితో సహా ఎత్తుకెళ్లాడు. అనంతరం మరో ముగ్గురు వచ్చి ఆమెను ఓ గదికి తీసుకెళ్లారు. ఆపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజున (ఫిబ్రవరి 26) బాధితురాలిని ఓ మారుమూల ప్రాంతంలో పడేశారు. స్పృహ వచ్చిన ఆమె.. స్థానికుల సహాయంతో ఇంటికి చేరుకుంది. ఆమె మయన్మార్ శరణార్థినంటూ తనవద్ద నున్న UN శరణార్థి కార్డును చూపి, ఫిబ్రవరి 26న పోలీసులకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నారని తెలిపారు.
Next Story