Mon Dec 15 2025 00:16:03 GMT+0000 (Coordinated Universal Time)
ఆ యువతి మృతికి కారణమేంది? బర్త్ డే రోజు ఏం జరిగింది?
రాజేంద్ర నగర్ చింతల్ మెట్ లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడలేదు.

రాజేంద్ర నగర్ చింతల్ మెట్ లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడలేదు. బ్యూటీషియన్ గా పనిచేస్తున్న ఇరాం ఖాన్ అలియాస్ సుమారే తాను అద్దెకున్న ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుట్టిన రోజు నాడు....
అయితే ఇరాంఖాన్ కొంత కాలంగా తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుంది. ఈ నెల 7వ తేదీన తన ఫ్లాట్ లో స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుంది. బర్త్ డే పార్టీకి హాజరైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరాంఖాన్ విజయ్ నగర్ కాలనీకి చెందిన యువతి.
Next Story

