Mon Dec 23 2024 06:14:29 GMT+0000 (Coordinated Universal Time)
బాలుడి ప్రాణం తీసిన టీవీ సెట్ టాప్ బాక్స్
కొద్దిరోజుల కిందట ఛార్గర్ పిన్ నమిలిన శిశువు ప్రాణాలు వదిలిన ఘటన కర్ణాటకలో
కొద్దిరోజుల కిందట ఛార్గర్ పిన్ నమిలిన శిశువు ప్రాణాలు వదిలిన ఘటన కర్ణాటకలో మనం చూశాం. ఇప్పుడు ఓ నాలుగేళ్ల బాలుడు సెట్ టాప్ బాక్స్ కారణంగా కరెంట్ షాక్ కొట్టి మరణించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఇంట్లోనే తల్లిదండ్రులు సంరక్షణలో పెరుగుతున్నాడు. ఆ పిల్లాడికి టీవీలో కార్టూన్లు చూసే అలవాటు ఉంది. అతడు టీవీ సెట్ టాప్ బాక్స్ ను టచ్ చేసి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లా హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరే పన్నసే ప్రాంతంలో ఇద్దరు దంపతులు తమ నాలుగేళ్ల పిల్లాడితో జీవిస్తున్నారు. తల్లి కుమారుడికి టీవీలో కార్టూన్లు పెట్టించి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. తండ్రి ఆ సమయంలో ఇంట్లోని మరో గదిలో నిద్రపోతున్నాడు. పిల్లాడు కార్టూన్లు చూస్తూ, ఆడుకుంటూ వెళ్లి టీవీ సెట్ ఆప్ బాక్సును తాకాడు. దీంతో బాలుడికి ఒక్క సారిగా కరెంట్ షాక్ తగిలింది. షాక్ తో వెంటనే కిందపడిపోయాడు. ఒక్క సారిగా తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే బాలుడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ ఆ బాలుడు అప్పటికే మరణించాడని డాక్టర్లు నిర్దారించారు. ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు.
Next Story