Mon Dec 23 2024 02:22:51 GMT+0000 (Coordinated Universal Time)
యూట్యూబ్ లో చూసి సొంతంగా కాన్పు.. ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే..
ఆ తర్వాత యూట్యూబ్లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దాని వల్ల కలిగే ఉపయోగాలకంటే అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్ లు ఇలా చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానుగా కాన్పు చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం హద్దులు మీరింది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.
బాలిక పొట్ట పెరుగుతుండటాన్ని గమనించిన తల్లి ఏంటని ప్రశ్నించగా.. అది అనారోగ్యం వల్ల పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది. ఇంట్లోనే ఉన్న ఓ పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తిరిగి ఇంటికెళ్లిన తల్లికి కుమార్తె నీరసంగా కనిపించడంతో.. కాస్త గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story