Sun Dec 22 2024 19:58:18 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపై నగ్నంగా వచ్చిన మహిళ.. తుపాకీతో..!
వెంటనే అక్కడికి చేరుకున్న హైవే ప్యాట్రోలింగ్ పోలీసులు ఆమెని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనలో
అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక చోట తుపాకీ పేలుడు మనం వింటూనే ఉంటాం. తాజాగా ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూలై 25, మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్పై నగ్నంగా ఓ మహిళ కారు దిగి తుపాకీతో కాల్పులు జరుపుకుంటూ వెళ్ళింది. తుపాకీని తీసుకుని ఆమె రోడ్డుపై వెళుతున్న కార్లకు గురిపెడుతున్నట్లు మనం గమనించవచ్చు. కార్లలో వెళుతున్న వ్యక్తులు ఆమెకు సంబంధించిన వీడియోను రికార్డు చేశారు.ఆమె గురించి 911 కు కాల్ చేసి చెప్పారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో జరిగింది.
వెంటనే అక్కడికి చేరుకున్న హైవే ప్యాట్రోలింగ్ పోలీసులు ఆమెని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఈ విధంగా ఎందుకు ప్రవర్తించిందో కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆమెని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె మానసిక స్థితి గురించి తెలుసుకుంటున్నారు. స్థానిక అధికారి ఆండ్రూ బార్క్లే మాట్లాడుతూ ఆమె కాల్పులకు తెగబడ్డా.. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని.. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అధికారులు వెంటనే స్పందించారని ప్రశంసించారు.
Next Story