Fri Dec 20 2024 11:34:01 GMT+0000 (Coordinated Universal Time)
మూడు కోట్లు మోసపోయిన యంగ్ హీరో
శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన పేర్లు బయటకు వస్తున్నాయి. శిల్పాని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో ఫిర్యాదులు అందుతున్నాయి
శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో మరికొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా హీరో హర్ష శిల్పా చౌదరిలో మోసపోయినట్లు తేలింది. ఈ మేరకు హర్ష పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను శిల్పాచౌదరికి మూడు కోట్లు ఇచ్చానని హర్ష చెబుతున్నారు.
వీకెండ్ పార్టీలో....
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి పెట్టుబడి కావాలంటూ తన వద్ద నుంచి శిల్పా చౌదరి మూడు కోట్ల రుణం తీసుకుందని తెలిపారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. శిల్పా చౌదరి ఏర్పాటు చేసిన వీకంెడ్ పార్టీలకు హర్ష హాజరవ్వడంతో అక్కడ శిల్పా చౌదరి పరిచయమయింది. హర్ష సహరీ అనే మూవీలో నటించాడు.
Next Story