Thu Dec 19 2024 18:40:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: YouTuber చందు సాయి అరెస్ట్
ప్రముఖ తెలుగు యూట్యూబర్, ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న
ప్రముఖ తెలుగు యూట్యూబర్, ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న చంద్ర శేఖర్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో యూట్యూబర్ చంద్ర శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు నార్సింగ్ పోలీసులు. 'చందు గాడు' పేరుతో బాగా ఫేమస్ అయ్యాడు చంద్రశేఖర్ సాయి కిరణ్. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన తెలుగు యూట్యూబర్ చంద్ర శేఖర్..లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. భాదితురాలు ఫిర్యాదుతో అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లి దండ్రులు, మరో ఇద్దరి పై కేసులు నమోదు అయింది.
పెళ్లి సాకుతో, తప్పుడు వాగ్దానాలతో 'రేప్- మోసం' ఆరోపణలపై యూట్యూబర్ చందు సాయిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌పై 420,376 ( 2) , ఎస్సీ , st అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story