Mon Dec 23 2024 08:11:25 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ లో ఎన్ఐఏ సోదాలు
సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది.
సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. పంజాబ్ తో పాటు హర్యానా, ఢిల్లీ పరిధిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ఈ హత్య కేసులో నిందితుల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తుంది. పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు జరుపుపుతుంది. ఫరీద్కోట్, రాజ్‌పురా, కోటక్ పురాలలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ హత్య కేసులో ఉగ్రముఠాలతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ దాడులు జరుగుతున్నాయని తెలిసింది.
గ్యాంగ్‌స్టర్ ఇళ్లలో....
పంజాబ్ లో సింగర్ ిసిద్దూ మూసేవాలను కొందరు తుపాకులతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. నీరజ్ బవానా, అతడి గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులే టార్గెట్ గా హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఈ పరిస్థితుల్లో నీరజ్ గ్యాంగ్ కు, లారెన్స్ బిష్ణోయ్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. మూసేవాలా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్ఐఏ ఈ దాడులు జరుపుతున్నట్లు తెలిసింది. మూసేవాలా హత్య కేసులో 35 మంది నిందితులుగా గుర్తించారు. వీరిలో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. నలుగురు విదేశాల్లో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
Next Story