Mon Dec 23 2024 09:48:47 GMT+0000 (Coordinated Universal Time)
పీఎఫ్ఐ కేసులో కొనసాగుతున్న విచారణ
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది. ఎన్ఐఏ ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది. బోధన్ కు చెందిన సమీర్, ఆదిలాబాద్ కు చెందిన ఫిరోజ్, జగిత్యాల కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ఇలాయాజ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
వివిధ అల్లర్లకు సంబంధించి...
వీరిని ఎన్ఐఏ న్యాయస్థానానికి తరలించారు. ఎన్ఐఏ నోటీసులు తొమ్మిది మంది విచారణకు హాజరయ్యారు. పీఎఫ్ఐ కు సంబంధించిన లావాదేవీలపై కూడా విచారణ జరుపుతుంది. భైంసా కుట్ర అల్లర్లతో పాటు ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన గొడవలపై కూడా ఎన్ఐఏ ఆరాతీస్తుంది. నిషేధిత సిమి సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించింది. కొన్ని ల్యాప్ట్యాప్ లను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని లోతుగా పరిశీలిస్తున్నారు.
Next Story