Mon Dec 23 2024 15:01:56 GMT+0000 (Coordinated Universal Time)
నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియో.. ఏముందంటే?
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. వైశాలిని తాను కిడ్నాప్ చేయడం తప్పేనని నవీన్ రెడ్డి అందులో పేర్కొన్నారు. కిడ్నాప్ చేయడానికి వెనక చాలా బాధ ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు.
పెళ్లి చేసుకుందామనే...
ఈ ఘటనతో తన కుటుంబం ఎంతో బాధపడుతుందని నవీన్ రెడ్డి పేర్కొన్నాడు. అంతకు ముందు జరిగింది.. తాను ఎందుకు ఇలా చేశానో ఆలోచించాలని నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియోలో కోరాడు. బాడ్మింటన్ ఆడుతూ తమ పరిచయం జరిగిందని, ఆలోచనలు కలిశాయని, పెళ్లిచేసుకుందామని ప్రతిపాదన తెచ్చానని నవీన్ రెడ్డి తెలిపాడు.
Next Story