Thu Dec 19 2024 12:43:36 GMT+0000 (Coordinated Universal Time)
17 ఏళ్లకే అమ్మాయికి గుండెపోటు
తానీషా చాలా తెలివైన అమ్మాయని, డాక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంటోందని ప్రిన్సిపల్ అమృత్ ఛత్రోల చెప్పారు.
చిన్న వయసులోనే పలువురు గుండె పోటుతో కుప్పకూలిపోతూ ఉండడం అందరినీ కలవరపెడుతూ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల సైన్స్ విద్యార్థిని తానీషా గాంధీ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందింది. గుజరాత్లోని నవసరి జిల్లాకు చెందిన తనీషా గాంధీ నవ్సారిలోని ఏబీ స్కూల్లో విశ్రాంతి సమయంలో పాఠశాల మెట్లు ఎక్కుతుండగా తనీషా కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తనీషా తన స్నేహితుల వద్దకు చేరుకునే సమయంలో ఆమె మెట్లపై కుప్పకూలిపోయింది. తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె మరణాన్ని ధృవీకరించారు. దీంతో ఆమె పాఠశాలలోనూ, కుటుంబంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.
తానీషా చాలా తెలివైన అమ్మాయని, డాక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంటోందని ప్రిన్సిపల్ అమృత్ ఛత్రోల చెప్పారు. తనీషా రెండేళ్ల క్రితమే తల్లిని కోల్పోగా.. ప్రస్తుతం తండ్రి వద్ద ఉంటోంది. 17 సంవత్సరాలకే తనీషా ప్రాణాలు కోల్పోవడాన్ని ఆమె స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Next Story