Tue Dec 24 2024 03:12:24 GMT+0000 (Coordinated Universal Time)
నయీమ్ అనుచరుడు శేషన్న అరెస్ట్
నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు.
నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు టాస్క్ ఫోర్సు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. శేషన్న అలియాస్ రాంచంద్రుడు గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. నిన్న రాత్రి కొత్తపేటలోని ఒక లాడ్జిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు శేషన్నను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దీర్ఘకాలం నయీమ్ తో పనిచేసిన శేషన్న సెటిల్్మెంట్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనేక కేసుల్లో...
హైదరాబాద్ లో పలు కేసుల్లో శేషన్న ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హుమయూన్ నగర్ లో నమోదయిన కేసులోనూ శేషన్ వాంటెడ్ గా ఉన్నారు. శేషన్న వద్ద నుంచి అనేక డాక్యుమెంట్లతో పాటు 9 ఎంఎం పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో శేషన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Next Story