Mon Dec 23 2024 07:28:35 GMT+0000 (Coordinated Universal Time)
మరో మహిళతో ఎస్సై భర్త సహజీవనం..తగిన బుద్ధి చెప్పిన భార్య
క్షణిక సుఖం కోసం అడ్డదార్లు తొక్కుతూ కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. అలా ఓ ఏఆర్ఎస్ఐ కట్టుకున్న భార్యను..
వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తూ.. మూడు ముళ్లు, ఏడడుగులూ వేసి చేసిన ప్రమాణాలను గాలికొదిలేసి.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం అడ్డదార్లు తొక్కుతూ కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. అలా ఓ ఏఆర్ఎస్ఐ కట్టుకున్న భార్యను కాదని మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. వారిద్దరూ కలిసి ఉంటోన్న ఇంటికెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటన నెల్లూరులో వెలుగుచూసింది.
బాధిత మహిళ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన వాసు, సామ్రాజ్యం లకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వాసు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఏఆర్ఎస్ఐ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. 2017 నుండి వాసు-సామ్రాజ్యం ల మధ్య మనస్ఫర్థలున్నాయి. భార్యను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. ఇంటికి కూడా వెళ్లడం లేదు. అనుమానం వచ్చిన భార్య.. భర్త గురించి విచారించడం మొదలు పెట్టింది.
భర్త తనను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో.. వెంటనే నెల్లూరు పోస్టల్ కాలనీలో వాళ్లు ఉంటోన్న ఇంటికెళ్లింది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, భర్తను చితకబాదింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని సామ్రాజ్యం పోలీసులను ఆశ్రయించింది.
Next Story