Mon Dec 23 2024 03:26:23 GMT+0000 (Coordinated Universal Time)
డ్యాన్స్ బార్ లో శ్రేయతో పరిచయం.. లెఫ్టినెంట్ కల్నల్ ఘాతుకం
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలోని లెఫ్టినెంట్ కల్నల్ గా విధులు నిర్వర్తిస్తున్న
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలోని లెఫ్టినెంట్ కల్నల్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి నేపాల్ మహిళను దారుణంగా హత్య చేశాడు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని డ్యాన్స్ బార్లో పని చేస్తున్న నేపాలీ మహిళను హత్య చేశాడు. 24 గంటల్లో ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. సోమవారం సిర్వాల్ గర్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.
లెఫ్టినెంట్ కల్నల్ తో వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. నేపాల్ కి చెందిన శ్రేయ శర్మ(30) వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సిలిగురిలో నివసిస్తోంది. అదే పట్టణంలో ఉన్న ఓ డ్యాన్స్ బార్ లో రామెందు ఉపాధ్యాయ్ అనే వివాహితుడితో ఆమెకు పరిచయం చేసుకుంది. రామెందు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రడూన్ లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పని చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి వీరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కల్నల్ ని కోరింది. దానికి అతను అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుని శ్రేయను తనతో పాటు డెహ్రడూన్ తీసుకెళ్లాడు. సెప్టెంబర్ 9న లాంగ్ రైడ్ కి తీసుకువెళ్తానంటూ బాధితురాలిని నమ్మించాడు. అనంతరం రాజ్ పూర్ రోడ్ లోని ఓ క్లబ్ లో ఆ మహిళతో మద్యం తాగించాడు. నగర శివారులోని థానో రోడ్ కి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి 1.30కి అక్కడికి చేరుకుని కారు పార్క్ చేశాడు. కారులోంచి దిగిన శ్రేయపై సుత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని సిర్వాల్ ఘర్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. డెహ్రడూన్ పోలీసులు నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నారు. అతన్ని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Next Story