Mon Dec 23 2024 05:00:21 GMT+0000 (Coordinated Universal Time)
శ్రద్ధ తరహా హత్య : మేనత్తని చంపి.. 10 ముక్కలు చేసి.. దారుణం
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైపూర్ లోని విద్యానగర్ పీఎస్ పరిధిలో నివాసముంటున్న మృతురాలు..
దేశరాజధాని ఢిల్లీలో శ్రద్ధ అనే యువతి తన ప్రియుడి చేతిలో దారుణహత్యకు గురైన ఘటన.. ఆరునెలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శ్రద్ధ హత్యోదంతం తర్వాత అలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తల్లిని ఏడిపించాడని తండ్రిని చంపిన కొడుకు, వివాహేతర బంధానికి అడ్డంగా ఉన్నారని చంపిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు తన మేనత్తను చంపి 10 ముక్కలు చేసి అడవిలో పాతిపెట్టిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైపూర్ లోని విద్యానగర్ పీఎస్ పరిధిలో నివాసముంటున్న మృతురాలు సరోజ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 27 ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు జరగా.. కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. సరోజ బాగోగుల్ని మేనల్లుడు అనూజ్ చూసుకుంటున్నాడు. అతనికి ఖర్చులకు కావాలసిన డబ్బును సరోజే ఇచ్చేది. డిసెంబర్ 11న అనూజ్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన మేనత్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
ఆవుకి రొట్టెలు పెట్టేందుకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాతి నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అనంతరం సరోజ కుమార్తె పూజకు ఈ విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేశానని, అంతా వెతుకుతున్నామని తెలిపాడు. అతడి మాటల్లో ఏదో తేడా గమనించిన పూజ డిసెంబర్ 13న తన తల్లి ఇంటికి వెళ్లింది. అనూజ్ వంటగదిలో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేస్తూ కనిపించడంతో.. పూజ ఏంటని ప్రశ్నించింది. అక్కడి నుండి అనూజ్ పరారయ్యాడు. ఈ విషయాన్ని పూజ పోలీసులకు, తన సోదరి, సోదరుడికి తెలిపింది.
పోలీసులు అనూజ్ ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన నేరాన్ని అంగీకరించాడు. తన పనులను అడ్డొస్తున్నందుకే సరోజను సుత్తితో కొట్టి చంపి, 10 ముక్కలు చేసి ఢిల్లీ శివారులోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు తెలిపాడు. అతను చెప్పిన వివరాల మేరకు పోలీసులు.. అడవిలో పాతిపెట్టిన సరోజ శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు పంపారు. అనూజ్ పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.
Next Story