Mon Dec 23 2024 10:57:07 GMT+0000 (Coordinated Universal Time)
3 నెలల తర్వాత..వెలుగు చూసిన పరువు హత్య
ఇంటర్ విద్యార్థిని మోహన్ కృష్ణ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అది పరువు హత్యగా అనుమానిస్తున్నారు
ఇంటర్ విద్యార్థిని మోహన్ కృష్ణ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రెడ్డిగారి పల్లెలో ఈ ఘటన జరిగింది. మోహన్ కృష్ణ జులై 7న ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అది హత్యగా తేలింది. ఈ ఘటన గ్రామంలో సంచలనం కలిగించింది.
ఇతర కులానికి చెందిన...
ప్రేమ విఫలమై ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం హత్యగా తేలడంతో కుటుంబ సభ్యులే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర కులం వాడిని ప్రేమించినందుకు ఈ పరువు హత్య చేసి ఉంటారని, ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
Next Story