Thu Dec 19 2024 03:53:32 GMT+0000 (Coordinated Universal Time)
8 ఫంక్షన్ హాలులో దాచి... రెచ్చగొట్టి
సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆవుల సుబ్బారావు కీలక సూత్రధారిగా గుర్తించారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆవుల సుబ్బారావు కీలక సూత్రధారిగా గుర్తించారు. ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు రైల్వే కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల రిమాండ్ ను విధించారు. అయితే రైల్వే శాఖ పలు కీలక అంశాలను వెల్లడించింది. ఆవుల సుబ్బారావు తన అనుచరులైన శివ, మల్లారెడ్డిలతో కలసి ఆర్మీ అభ్యర్థులతో 8 వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేశారు. బోడుప్పల్ లో ఒక హోటల్ లో కుట్రకు ప్లాన్ చేశారు. ఇందుకోసం రూ.35 వేలు ఖర్చు చేశాడు.
ఎనిమిది వాట్సాప్ గ్రూపులు....
వారందరినీ సికింద్రాబాద్ కు ఆవుల సుబ్బారావే తరలించారు. వారిని సికింద్రాబాద్ సమీపంలోని ఎనిమిది ఫంక్షన్ హాళ్లలో ఉంచారు. వారికి భోజన సదుపాయాలను కల్పించారు. వాట్సప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్ ల ద్వారా వారిని రెచ్చగొట్టాడు. బీహార్ తరహాలోనే విధ్వంసానికి పాల్పడాలని ఆవుల సుబ్బారావు పేర్కొన్నట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కుట్ర కోణంలోనే జరిగిందని వారు చెప్పారు. అల్లర్లు జరిగిన తర్వాత సుబ్బారావు హైదరాబాద్ నుంచి పారిపోయాడని రైల్వే పోలీసులు వెల్లడించారు.
Next Story